సిరియా: పాతాళ వైద్యమే క్షేమం
- November 26, 2017
డమాస్కస్: సిరియాలో అండర్‌గ్రౌండ్ ఆస్పత్రిని ప్రారంభించినట్టు నిర్వా హుకులు తెలిపారు. సిరియాలోని విద్యాసంస్థలను, ఆస్పత్రులను, రద్దీ ప్రాంతా లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వైమానిక దాడులకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో క్షతగాత్రులకు వైద్యం అందించడం చాలా ఇబ్బందిగా మారింది. అండర్‌గ్రౌండ్ ఆస్పత్రి ద్వారా వైద్యం అందించేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. అయితే, ఆస్పత్రి పేరు, ప్రారంభించిన ప్రదేశం తదితర వివరాలను మీడియాకు అందించేందుకు మాత్రం ఆసంస్థ ససేమిరా నిరాకరించింది. పేలుళ్ల లో గాయపడ్డ వారిని రక్షించేందుకు ప్రయత్నించనున్నట్టు తెలిపింది. కాగా, 2011లో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉగ్రవాదు లకు, భద్రతాబలగాలకు మధ్య జరుగుతున్న భీకరపోరులో వేలాది మంది మృతి చెందారు. లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు ప్రాణ భయంతో తరలివెళ్లారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







