సౌదీ: ఉగ్రసంస్థల నిర్మూలనపై ఉక్కుపాదం
- November 26, 2017
రియాద్: ఉగ్రసంస్థల నిర్మూలనలో తమ మిత్రదేశాలకు సహకరించనున్నట్టు సౌదీ రాకుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు. రియాద్‌లో సౌదీ మిత్రదేశాల సమావేశం జరిగింది. సౌదీ మిత్రదేశాలకు చెందిన రక్షణ మంత్రులు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఉగ్రసంస్థలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. మిత్రదేశాలకు అవసరమైన ఆయుధాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవ్యతిరేక ఆపరేషన్‌కు అవసరమైన సహకారాన్ని అందిస్తామని అన్నారు. సౌదీ మిత్రదేశాలన్ని పరస్పర సహాయ సహకారాలను అందించుకుంటూ సమిష్టి కృషి చేస్తున్నాయనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు అందించాలన్నదే తమ అభిమతం అన్నారు. ఇస్లామిక్ మిలిటరీ అలియన్స్ (ఐఎంఏ) 2015, డిసెంబర్15న రియాద్‌లో ఏర్పాటైంది. ఈ గ్రూప్‌లో ప్రస్తుతం 41 సభ్య దేశాలున్నాయి. పాకిస్థాన్ ఆర్మీ జనరల్ (రిటైర్డ్ ) రాహిల్ షరీఫ్ ఈఏడాది ఏప్రిల్ నుంచి సౌదీ సంకీర్ణదళాలు నిర్వహిస్తున్న యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







