షూలలో బంగారం బిస్కెట్లు
- November 27, 2017
చెన్నై విమానాశ్రమానికి అక్రమంగా తెచ్చిన రెండు కిలోల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. షార్జా నుంచి ఆదివారం సాయంత్రం తిరువనంతపురం మార్గంలో చెన్నైకి ఓ విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని కోలికోడ్‌కు చెందిన ఇస్రాత్ (33) పట్టుబడ్డాడు. ఆయన ధరించిన షూలను తనిఖీ చేయగా రెండు కిలోల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఆయన వాటిని షూలోని ప్రత్యేక అరలో అమర్చుకుని అక్రమంగా తరలించేందుకు యత్నించాడు. వీటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







