దేవిశ్రీ ఛార్మీల హాట్ న్యూస్ !
- May 01, 2015
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఛార్మీల మధ్య ప్రేమ వ్యవహారం పై గతంలో చాల సార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కూడ గతంలో పబ్లిక్ ఫంక్షన్స్ లో కలిసినప్పుడు ఒకరి పై ఒకరు అభిమానాన్ని వ్యక్త పరుచుకుంటూ తమ స్నేహాన్ని చాటుకునే వారు. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ షోలు చేస్తున్నప్పుడు ఛార్మీ మొదటి వరసలో కూర్చుని అభిమానులతో సమానంగా హడావిడి చేస్తూ ఈలలు వేస్తూ దేవిశ్రీ ప్రసాద్ కు తన వంతు జోష్ ను అందించేది. అయితే ఈ మధ్య కాలంలో వీరిద్దరి స్నేహబంధానికి సంబంధించిన వార్తలు బాగా తగ్గాయి. ఈ నేపధ్యంలో అనుకోని విధంగా ఊహించని ట్విస్ట్ ఇస్తూ దేవిశ్రీ ప్రసాద్ ఛార్మీని ఆకాశంలోకి ఎత్తేస్తూ పెట్టిన ట్విట్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది . దేవిశ్రీ ప్రసాద్ ఛార్మీని ఆకాశంలోకి ఎత్తేస్తూ పెట్టిన ట్విట్ ఛార్మీ ప్రస్తుతం నటిస్తున్న 'జ్యోతిలక్ష్మి' సినిమా 37 రోజులలో షూటింగ్ పూర్తి అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ దర్శకుడు పూరీని హీరోయిన్ ఛార్మీని అభినందిస్తూ 'మీరిద్దరూ ఆదరగొడుతున్నారు' అంటూ పెట్టిన ట్విట్ తో తిరిగి ఛార్మీ దేవిశ్రీల మధ్య స్నేహం మళ్ళీ మొదలైందా? అంటూ ఫిలింనగర్ లో వార్తల గాసిప్పులు వినపడుతున్నాయి. ఛార్మీ తన లుక్ ను పూర్తిగా మార్చుకుని 'జ్యోతిలక్ష్మి' ద్వారా తిరిగి తన హవాను టాలీవుడ్ లో ప్రారంభించాలి అని ఆశ పడుతున్న నేపధ్యంలో దేవిశ్రీ లేటెస్ట్ ట్విట్ ఛార్మీకి మంచి జోష్ కలిగిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహంలేదు..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







