మెట్రో: జీహెచ్‌ఎంసీకి ఘోర పరాభవం

- November 28, 2017 , by Maagulf

జీహెచ్ఎంసీకి మెట్రో అధికారులు షాకిచ్చారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మెట్రోరైలు ప్రాజెక్ట్‌లో కొన్ని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మెట్రో తొలిదశకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద మేయర్ పేరు మచ్చుకైనా కనిపించలేదు. ప్రారంభకులుగా ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పేర్లు మాత్రమే స్పష్టంగా వున్నాయి. ఇక కేంద్ర సహాయమంత్రి హరదీప్ సింగ్ పూరీ, తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్లు కూడా వున్నాయి. కాకపోతే నగరానికి ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్ పేరు లేకపోవడం గమనార్హం.

ఇదిలావుంటే.. ప్రధాని మోదీతో కలిసి మెట్రోలో ప్రయాణించే వీఐపీల జాబితాలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి పేరు గల్లంతైంది. మెట్రో ప్రాజెక్ట్‌కి చేదోడువాదోడుగా వుంటూ నిర్మాణ పనుల్లో సహకరించిన జీహెచ్ఎంసీ కమిషనర్‌ని పూచికపుల్లగా తీసిపడేయడం విమర్శలకు తావిస్తోంది. కానీ, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారమే తాము వ్యవహరించినట్టు అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com