కూలిన విమానం..ఇద్దరు మృతి

- November 28, 2017 , by Maagulf
కూలిన విమానం..ఇద్దరు మృతి

మాస్కో: కనిపించకుండా పోయిన ఓ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రష్యాలోని తంబోవ్‌ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ సంస్థకు చెందిన విమానం సోమవారం సాయంత్రం బయలుదేరిన కాసేపటికే కమ్యూనికేషన్‌ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో దాని గురించి అధికారులు వెతకటం ప్రారంభించారు. అయితే తంబోవ్‌ ప్రాంతంలో దహనమౌతున్న వాటి శకలాలు గుర్తించిన స్థానికులు కొందరు సమాచారం అందించటంతో ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. పైలెట్లు ఇద్దరూ చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com