సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది
- November 28, 2017
అంగరంగ వైభవంగా 2017 అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సదస్సును ప్రారంభించారు. 127 దేశాల నుంచి దాదాపు 15 వందల మంది ఎంట్రప్రెన్యూర్స్ ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత, అమెరికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు మూడ్రోజులపాటు జరగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సర్వాంగ సుందరంగా వేదికను తీర్చిదిద్దారు. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఇచ్చారు. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండడం ఆనందంగా ఉందని అన్నారు. హైదరాబాద్ వేగంగా నడుస్తున్న నగరం అని.. తెలంగాణలో వ్యాపార అనుమతులకు సింగిల్ విండో విధానం అమలులో ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు. 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని.. అంకుర సంస్థలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







