ఇవాంకాకు అమెరికన్, చైనీస్, ఇండియన్, తెలంగాణ స్పెషల్స్...

- November 28, 2017 , by Maagulf
ఇవాంకాకు అమెరికన్, చైనీస్, ఇండియన్, తెలంగాణ స్పెషల్స్...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంక తన టీమ్‌తో మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశంతో సదస్సు సాగుతోన్న ఈ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ నేపధ్యంలో ఇవాంక కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో స్పెషల్ మెనూ సిద్ధం చేశారు. ఎగ్జిక్యూటివ్ చెఫ్ సాజేష్ నాయర్ నేతృత్వంలో ప్రత్యేక వంటకాలను రెడీ చేశారు. ఈ విందులో అమెరికన్, చైనీస్, ఇండియన్ సహా తెలంగాణ స్పెషల్ ఐటమ్స్‌నూ ఇవాంకకు రుచి చూపించనున్నారు. అమెరికన్ చెఫ్‌ల సమక్షంలో వంటలు సిద్ధం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు చెకింగ్ తర్వాత అతిథులకు వడ్డించనున్నారు. 
హైదరాబాద్ అంటేనే ఠక్కున గుర్తొచ్చే ఫుడ్ ధమ్ బిర్యానీ. తెలంగాణ సంప్రదాయ వంటకాల రుచి చూపించనున్నారు. ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక విందులో పెద్ద మెనూనే ఉంది. ధమ్ బిర్యానీ, మ‌ుర్గ్ షీక్ క‌బాబ్ మొనాలి చికెన్‌, నాన్ రోటీ, రుమాలీ రోటీ, మ‌ట‌న్ కోఫ్తా, మొగ‌లాయి మ‌ట‌న్‌, మొఘలాయి చికెన్, బ‌గారా బైంగన్, కుర్బానీ కా మీఠా, డ్రైప్రూట్స్ ఖీర్, మటన్ ముర్గ్, రైతాలతో పాటు మరిన్ని వెరైటీలు సిద్ధం చేస్తున్నారు. 
వీటితో పాటే దహీకే కబాబ్, షికమ్‌పురి కబాబ్, ఖుర్బానీకే మలై కోఫ్తా, ముర్గ్ పిస్తా కా సలాన్, సీతాఫల్ కుల్ఫీ సహా పలు రకాల సూప్‌లు మెనూలో పెట్టారు. వీటితో పాటు అమెరికన్ టాప్ టెన్ డిషెస్, చైనీస్ సహా పలు వెరైటీ వంటకాలను సిద్ధం చేశారు. ఈ వంటకాల తయారీ కోసం ప్రత్యేక ముడిసరుకులతో పాటు ప్రముఖ చెఫ్ లను నియమించారు. విందు ఏర్పాట్లు కోసం చెఫ్ అండ్ మెనూ క‌మిటీలో ఇవాంక వ్య‌క్తిగ‌త పుడ్ అండ్ బేవ‌రేజ్ సిబ్బంది కూడా ఉన్నారు. కొన్ని ముడిసరుకులను అమెరికా నుంచే తెప్పించారు. ఫ‌ల‌క్ నామా చెఫ్‌లతో పాటు అమెరికా నుండి వ‌చ్చిన వ్య‌క్తిగ‌త చెఫ్ ల ప‌ర్య‌వేక్షణ‌లోనే వంట‌కాలు చేస్తున్నారు. 30 రకాల ఇండియన్ వెరైటీస్, 20 అమెరికన్ టేస్టీ ఫుడ్ ఐటెమ్స్ ఘుమఘుమలాడించనున్నాయి.
ఫలక్ నామా ప్యాలెస్ లోని పెద్దదైన డైనింగ్ టేబుల్ మీద విందు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ప్రారంభం కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com