యూఏఈ నేషనల్ డే: ఉల్లంఘనకు 2,000 దిర్హామ్ల జరీమానా
- November 28, 2017
యూఏఈ: యూఏఈ నేషనల్ డే సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే 2,000 దిర్హామ్ల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రముఖ స్ట్రీట్స్లో ప్రత్యేక పెట్రోల్ వాహనాల్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బుర్ దుబాయ్, జుమైరా స్ట్రీట్, అల్ సుఫోహ్ స్ట్రీట్, జిబిఆర్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ వాహనాలు మోహరిస్తున్నారు. డేడ్రా, అల్ మురాక్కాబాత్, అల్ రక్కా, అల్ మంజార్, రషిదియా, అల్ ఖలీజ్ స్ట్రీట్, అల్ ఇత్తిహాద్ స్ట్రీట్, అమ్మాన్ స్ట్రీట్, యూనివర్సిటీ సిటీ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగేలా వాహనాల్ని నడపడాన్ని సీరియస్గా పరిగణిస్తామని అధికారులు చెప్పారు. రోడ్లపైన వాహనాల్ని నిలిపివేయడం, వాహనాలతో శబ్ద కాలుష్యం అతిగా చేయడం వంటివాటికి కఠిన చర్యలుంటాయి. 6 నుంచి 23 బ్లాక్ పాయింట్స్ వరకూ ఆయా నేరాలకు వర్తిస్తాయి. అలాగే జరీమానాలు 1,000 దిర్హామ్ నుంచి 2,000 దిర్హామ్ వరకు జరీమానా తప్పదు. వాహనాల జప్తు 60 రోజుల వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







