వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌

- November 28, 2017 , by Maagulf
వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌

వాషింగ్టన్‌: వాట్సాప్‌ తమ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సందేశాల్లో భాగంగా పంపే యూట్యూబ్‌ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌ను వీడాల్సిన అవసరం లేదు. చాట్‌లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొని చూడొచ్చు. ఐవోఎస్‌ వినియోగదారుల కోసం ఈ సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. చాట్‌లో భాగంగా ఏదైనా యూట్యూబ్‌ వీడియో లింక్‌ను పంపిస్తే ఇక ఆ వీడియోను వాట్సాప్‌లోనే చూసుకోవచ్చు. ఆ వీడియోను చూస్తూ చాట్‌ను కొనసాగించవచ్చు. ఇతర చాట్‌లోకి కూడా వెళ్లవచ్చు. గతంలో ఎవరైనా పంపిన యూట్యూబ్‌ వీడియో లింక్‌ను క్లిక్‌ చేస్తే అది యూట్యూబ్‌ యాప్‌లోకి వెళ్లి ప్లే అయ్యేది. దీంతో వాట్సాప్‌ నుంచి యూజర్‌ యూట్యూబ్‌కు వెళ్లాల్సివచ్చేది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు నేరుగా సంభాషణల మధ్యలోనే వీడియోను చూసుకునే సదుపాయం లభించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com