లోదుస్తుల్లో అమెరికన్ డాలర్ల కట్టలు..
- November 28, 2017
చెన్నై: లో దుస్తుల్లో దాచుకుని అక్రమంగా తరలించటానికి ప్రయత్నించిన ఓ యువకుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి రూ.5 లక్షల అమెరికా డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో మంగళవారం చోటు చేసుకుంది. చెన్నై నుంచి నేటి వేకువజామున 3.30 గంటల సమయానికి కొలంబో వెళ్లే శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఆ విమాన ప్రయాణీకుల లగేజీని అధికారులు పరిశీలన చేసి పంపుతున్నారు.
ఆ సమయంలో చెన్నైకి చెందిన షంషుద్ధీన్ (32) టూరిస్ట్ వీసా మీద శ్రీలంకకు వెళ్లటానికి వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం రావడంతో అధికారులు షంషుద్దీన్ లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా అనుమానం నివృత్తి కాని అధికారులు షంషుద్ధీన్ ను గదిలోకి తీసుకుని వెళ్లి తనిఖీలు చేయగా అతడి లోదుస్తుల్లో కట్టలు కట్టలుగా ఐదు లక్షల అమెరికా డాలర్లు కనిపించాయి. అది లెక్కచూపని నగదు అని తేలటంతో అతడి ప్రయాణాన్ని రద్దు చేశారు. నిందితుడు షంషుద్దీన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







