భారీగా బిజినెస్ చేస్తున్న 'భాగమతి'
- November 28, 2017
హైదరాబాద్: అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం 'భాగమతి'. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆది పినిశెట్టి, ఆశా శరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జి. అశోక్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. థమన్ స్వరాలు అందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం పంపిణీ హక్కులకు భారీ డిమాండ్ నెలకొందట. తమిళ భాషలో చిత్రం హక్కులను స్టూడియో గ్రీన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం రూ.15 కోట్లకు పంపిణీ హక్కులను కొనుగోలు చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 'భాగమతి' తర్వాత అనుష్క తన కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. అయితే ఆమె తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించనున్న ఓ చిత్రంలో నటించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. రామ్‌గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్లో వస్తోన్న కొత్త సినిమాలో కూడా అనుష్కను కథానాయికగా అనుకుంటున్నట్లు సమాచారం. వీటిపై ఆమె ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష