నా రాజీనామా వార్తల్లో నిజం లేదు

- November 28, 2017 , by Maagulf
నా రాజీనామా వార్తల్లో నిజం లేదు

హైదరాబాద్‌: తన పదవికి రాజీనామా చేశాననే వార్తల్ని హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఖండించారు. మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా గౌరవించిందని, ప్రధానికి ఘనంగా స్వాగతం పలికానని రామ్మోహన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ''నగర ప్రథమ పౌరుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆ కారణంతోనే సర్కారు శిలాఫలకంలో స్థానం ఇవ్వలేదు. ఇదే విషయమై తీవ్ర అసంతృప్తికి గురైన మేయర్‌ రాజీనామాకు సిద్ధమయ్యారు'' అంటూ మంగళవారం ఉదయం నుంచి వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై స్పందించిన రామ్మోహన్‌ సైబర్‌క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ''కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై కక్షతో ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. వారం క్రితం కూడా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)కు మేయర్‌ను ఆహ్వానించలేదు. నగరానికి ఇది అవమానకరం'' అంటూ ఇలానే వార్తలు గుప్పుమన్నాయని నేర విభాగం అదనపు కమిషనర్‌ రఘువీర్‌కు మేయర్‌ వివరించారు.

జీఈఎస్‌ ప్రైవేటు కార్యక్రమమని, అందులో ప్రోటోకాల్‌ ప్రసక్తే ఉండదన్నారు. అనవసరమైన వార్తల్ని సృష్టిస్తూ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనుకుంటున్న కుట్రదారుల్ని గుర్తించి చట్టప్రకారం శిక్షించాలని ఆయన పోలీసుల్ని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com