రాజశేఖర్‌తో వెంకటేష్ మల్టీస్టారర్ సినిమా
- November 29, 2017
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన వెంకటేశ్ త్వరలో గరుడ వేగతో హిట్ కొట్టిన హీరో రాజశేఖర్‌తో కలిసి నటించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. తేజ దర్శకత్వంలో వెంకీ త్వరలో సినిమా చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది.
నేనే రాజు నేనే మంత్రి సినిమాకు తర్వాత తేజ దగ్గుబాటి మరో హీరో అయిన వెంకీతో సినిమా చేయాలని ప్లాన్ చేసేసుకున్నారు. స్క్రిప్ట్ కూడా వెంకీకి నచ్చేయడంతో అతని సినిమాకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా నటీనటుల ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకీ బావగా ఈ చిత్రంలో రాజశేఖర్ కనిపిస్తారట. ఈ రోల్ ఈ సినిమాకు కీలకమైందని.. అందుకే తేజ రాజశేఖర్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







