నిమిషాల్లోనే ద.కొరియా క్షిపణి ప్రయోగం!
- November 29, 2017
సియోల్: ఉత్తరకొరియా విధ్వంసక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ను బుధవారం ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే ఉ.కొరియా ఈ క్షిపణిని ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే దక్షిణ కొరియా కూడా క్షిపణిని ప్రయోగించింది. ఉ.కొరియాకు దీటుగా సమాధానం చెప్పడానికే ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ద.కొరియా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
రాజధాని సియోల్ మీదుగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ద.కొరియా పేర్కొంది. ఉ.కొరియా చేపట్టే ప్రయోగాలు త్వరలో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉ.కొరియాను ఉగ్రదేశంగా ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ యున్ ఈ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు.
ఈ విషయమై ట్రంప్.. జపాన్ ప్రధాని షింజో అబే, ద.కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్‌లతో అత్యవసరంగా ఫోన్లో విడివిడిగా చర్చలు జరిపారు. మరోవైపు జపాన్ అభ్యర్థనపై ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) అత్యవసరంగా సమావేశం అయ్యేందుకు అంగీకరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







