సకాలంలో చెల్లించకపోతే 25 దిర్హామ్‌ల జరీమానా: ఎటిసలాట్
- November 29, 2017
యూఏఈ:సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారుల నుంచి యూఏఈ టెలికాం సంస్థ ఎటిసలాట్ 25 దిర్హామ్‌లను అపరాధ రుసుము కింద వసూలు చేయనుంది. ల్యాండ్‌లైన్, మొబైల్ సర్వీసులకు ఈ లేట్ పేమెంట్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. అలాగే, ఎటిసలాట్తోపాటు యూఏఈకి చెందిన మరో టెలికాం కంపెనీ డు, ఐదు శాతం వ్యాట్ని తమ సర్వీసులు, ప్రోడక్ట్స్‌పై వసూలు చేయనున్నట్లు ప్రకటించాయి. జనవరి 1 నుంచి అమల్లోకి వ్యాట్ రానున్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థలు స్పష్టం చేశాయి. పలు రకాలైన వస్తువులు, సర్వీసులపై యూఏఈ జనవరి 1 నుంచి ఐదు శాతం వ్యాట్ని వసూలు చేయనున్న సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







