బంగళాఖాతంలో వాయుగుండం..
- November 30, 2017
తమిళనాడును మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరం వర్ష బీభత్సానికి చిగురుటాకులా వణుకుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనం హడలిపోతున్నారు. చెన్నై శివారులోని.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చుట్టూ కమ్మేసిన వాన నీటిని దాటుకుని.. బయటకు వచ్చేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రోడ్లన్ని జలమయం కావడంతో.. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంకను ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వివరించింది. సముద్రంలో ప్రస్తుతం గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని, చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరికొద్ది రోజులు వానలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా ఏడు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో సెలవుల మీద వెళ్లిన రెవెన్యూ శాఖ, పురపాలక శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







