విరాట్ ను కలవడం చాలా సంతోషం: రమ్యకృష్ణ
- December 02, 2017

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విజయ ఢంకా మోగించిన తెలుగు చిత్రం 'బాహుబలి 2'. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం ఇటీవల ఓ ఛానెల్ నుంచి 'అత్యుత్తమ విజయం' అవార్డు అందుకుంది. ఈ వేడుకకు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ, 'శివగామి' రమ్యకృష్ణ హాజరయ్యారు. కాగా, ఇదే కార్యక్రమంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేదికపై విరాట్‌తో కలిసి దిగిన ఫొటోను రమ్యకృష్ణ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. విరాట్ చాలా మంచి వ్యక్తని, ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
రమ్యకృష్ణ 'హలో', 'గ్యాంగ్' చిత్రాల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ రెండు సినిమాల చిత్రీకరణ చివరి దశలో ఉంది. అఖిల్ హీరోగా నటిస్తున్న 'హలో' చిత్రం డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య నటిస్తున్న 'గ్యాంగ్' వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







