వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలలో 50 శాతం రాయితీ ప్రకటించిన క్రౌన్ప్రిన్స్
- December 02, 2017
అబుదాబి : నేడు యూఏఈ జాతీయ దినోత్సవం (డిసెంబర్ 2) సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడి చెల్లించాల్సిన జరిమానాల్లో 50 శాతం మినహాయింపునిచ్చారు. ఈ మేరకు క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి, డిఫ్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సంబంధింత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అన్నీ శాఖలు సమన్వయంతో పని చేసి జరిమానాలకు 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని ఆదేశించారు. మొదటగా అబుదాబి నగర అధికారులు జరిమానాలకు డిస్కౌంట్ ఇస్తున్నామని ప్రకటించారు. ఈ వెసులుబాటును దేశవ్యాప్తంగా అందరికీ వర్తింపజేయాలని ఆయన ప్రకటించారు. డిసెంబర్ 2 వ తేదీ నుంచి రెండు నెలలపాటు ఈ చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఆ అవకాశం ఉండదని అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







