పర్యాటక వీసాపై వెళ్లి...దుబాయ్ లో దొంగతనం చేసిన చైనా యువకులు
- December 02, 2017
దుబాయ్: చుట్టపు చూపుగా వెళ్లిన పర్యాటక వీసాపై దుబాయ్ వెల్లిన ఇరువురు చైనా యువకులు ఇళ్లకు కన్నం వేసి జైలుపాలయ్యారు. 25, 31 ఏళ్ల వయసున్న ఇద్దరు చైనా యువకులు పర్యాటక వీసా తీసుకుని దుబాయ్ నగరం వెళ్లారు. నగర అందాలను ఆశ్వాదించి తిరిగివెళ్లకుండా దొంగతనానికి పాల్పడ్డారు. ఎవరూలేని ఓ భవనాన్ని పరిశీలించి దొంగతనం చేశారు. 8 లక్షల దిర్హమ్‌ల విలువైన బంగారం, 2 లక్షల దిర్హమ్‌ల నగదు దొంగతనానికి పాల్పడ్డారు. పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చి బాధిత కుటుంబం కంగుతింది. ఇంట్లో బంగారం, డబ్బు దొంగతనానికి గురయ్యాయని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ కెమేరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. వీరికి సహాయం చేసిన మరో వ్యక్తికి కూడా శిక్ష విధించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







