బలహీనపడ్డ ఓక్కి
- December 02, 2017
న్యూఢిల్లీ : తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కుదేలు చేసి అపార నష్టాన్ని మిగిల్చిన ఓక్కి తుఫాన్ ఊహించని విధంగా మారిపోయింది. ప్రస్తుతం లక్షద్వీప్ వద్ద కేంద్రీకృత తన ఉధృతిని చూపిస్తున్న ఓక్కి ఒక్కసారిగా బలహీనపడిపోయింది. అనూహ్యంగా దిశను మార్చుకుని గుజరాత్ తీరం వైపు నెమ్మదిగా కదులుతోంది. దీంతో జాతీయ వాతావరణ పరిశోధన శాఖ గుజరాత్‌కు వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం గంటకు 18 మైళ్ల వేగంతో కదులుతున్న ఓక్కి డిసెంబర్ 4న గుజరాత్ తీరాన్ని తాకే అవకాశం ఉందంట. దీంతో మత్స్యకారులు ఈ మూడు, నాలుగు రోజులు వేటకు వెల్లకపోవటమే ఉత్తమమని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే డిసెంబర్ 6న ఖంభట్ తీరాన్ని తాకే లోపు ఇది బలహీనపడే అవకాశలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో జాలర్లు అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు కనిపిస్తున్నాయి.
కాగా, ఓక్కి తుఫాన్ ధాటికి రెండు రాష్ట్రాల్లో మొత్తం 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ తుఫాన్‌తో తీవ్ర నష్టం వాటిల్లినందున్న జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రాన్ని కోరనున్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి ఇదివరకే ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. మరోపక్క ఉత్తర తమిళనాడుకు ‘సాగర్’ తుఫాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు మరోసారి అప్రమత్తమవుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







