మెగా ఉద్యోగమేళా ముగింపు వేడుకలు.. 1087 మందికి ఉద్యోగాలు..!!
- December 02, 2017
ప్రపంచపటంలో ఏపీ ఒక బ్రాండ్‌గా నిలవడానికి రాష్ట్ర యువతే కారణమన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో జరిగిన మెగా ఉద్యోగమేళా ముగింపు వేడుకలకు హాజరై తెలుగు యువతపై ప్రశంసలు కురిపించారు. 2019 నాటికి ఐటీలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. విజయవాడలోని ఎ-కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మెగా ఉద్యోగా మేళా ముగింపు వేడుకలకు సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ప్రపంచ పటంలో ఏపీ ఒక బ్రాండ్‌గా నిలబడటానికి.. రాష్ట్ర యువత తెలివితేటలు, తన మార్కెటింగ్ నైపుణ్యమే కారణమన్నారు సీఎం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అత్యంత తెలివైనవారన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ కూడా యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఐటీ ద్వారా 2019 నాటికి లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
సమాచార సాంకేతిక అకాడమీ ఆధ్వర్యంలో ఈ మెగా ఉద్యోగమేళా వారం రోజుల పాటు జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల మంది యువకులు ఈ జాబ్ మేళాకు తరలివచ్చారు. వారిలో 1087 మందికి అధికారులు ఉద్యోగాలు కల్పించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించిన కంపెనీల ప్రతినిధులను సీఎం సన్మానించారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







