బంగాళాఖాతంలో అల్పపీడనం.. దక్షిణ కోస్తాకు వర్ష సూచన

- December 03, 2017 , by Maagulf
బంగాళాఖాతంలో అల్పపీడనం.. దక్షిణ కోస్తాకు వర్ష సూచన

దక్షిణ కోస్తాకు మరో ముప్పు ముంచుకోస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ప్రస్తుతం ఇది దక్షిణ అండమాన్ సముద్రానికి సమీపంలో..అగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు, నాలుగు రోజుల్లో ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు  తీరానికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com