న్యూఢిల్లీ:ఓమన్ విమాన కో పైలెట్‌కు లైసెన్స్ లేదని...విమానం నిలిపివేత
- December 07, 2017
న్యూఢిల్లీ: వాహనం నడుపుతున్న డ్రైవరు తన డ్రైవింగ్ లైసెన్సును ఇంట్లో మరచిపోతే ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించడం సర్వసాధారణం. కాని...మస్కట్ దేశానికి చెందిన ఓమన్ విమాన కోపైలెట్ లైసెన్సు లేకుండానే విమానం నడిపేందుకు విధులకు హాజరైన ఘటన న్యూఢిల్లీలో సంచలనం రేపింది. ఓమన్ విమానం న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలు దేరాల్సి ఉండగా సాధారణ తనిఖీల్లో ఆ విమాన కో పైలెట్ కు లైసెన్సు లేదని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. అంతే ఓమన్ విమానం వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు నిరాకరించారు. ఓమన్ ఎయిర్ కు చెందిన ఢిల్లీ- మస్కట్ విమాన కోపైలెట్ వద్ద లైసెన్సు లేకపోవడంతో విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలోనే నిలిపివేశారు. లైసెన్సు లేకుండా పైలెట్లు విమానాలు నడుపుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







