చింత చిగురుతో బొమ్మిడాయిలు, మామిడికాయ

- December 07, 2017 , by Maagulf
చింత చిగురుతో బొమ్మిడాయిలు, మామిడికాయ

కావలసిన పదార్థాలు: బొమ్మిడాయిలు - నాలుగు, మామిడికాయ - ఒకటి, చింతచిగురు - 50గ్రా, ఉల్లిపాయలు - రెండు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, ధనియాల పొడి - ఒక టీస్పూను, గరం మసాలా పొడి - పావు టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, నూనె - నాలుగు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: బొమ్మిడాయిలను తల, తోక తీసేసి రెండు లేదా మూడు అంగుళాల ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బొమ్మిడాయి ముక్కలు వేసి దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు దోరగా వేగించి అందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా వేగిన తరువాత చింతచిగురు, మామిడికాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని మంటమీద ఉంచాలి. పదినిమిషాల తర్వాత నీళ్ళు, ఉప్పు వేసి, వేగించి పెట్టుకున్న బొమ్మిడాయిల ముక్కలు, గరం మసాలా కూడా వేసి కూర దగ్గర పడ్డాక దించేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com