గాయపడ్డ హీరో కళ్యాణ్ రామ్..
- December 08, 2017
నందమూరి కళ్యాణ్ రామ్ షూటింగ్ లో గాయపడ్డాడు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయ్యింది. కాకపోతే వెలుగులోకి మాత్రం ఈరోజు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం కళ్యాణ్ రామ్ జయేంద్ర డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబదించిన షూటింగ్ వికారాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతుంది.
రౌడీ గ్యాంగ్ ను ఛేజ్ చేసే సీన్లు తీస్తుండగా బ్రిడ్జి మీద నుంచి ఫ్లాట్ ఫారమ్ మీదకు మెట్ల మీదుగా కాస్త వేగంగా దిగాలి.
కానీ అదే టైమ్ లో పై మెట్టు మీద కళ్యాణ్ రామ్ కాలు స్లిప్ కావడం తో ఆయన ఫై నుండి కిందికి పడ్డాడు. దీనివల్ల చేయి వాచింది, మణికట్టు బెణికింది. ఆ వెంటనే కారవాన్ లో ఓ అరగంట రిలాక్స్ అయ్యారట. హాస్పిటల్ కు వెళ్దామంటే, వద్దని బయటకు వచ్చి ఆ సీన్ కంప్లీట్ చేశారట. అంతే కాదు, వన్ డే రెస్ట్ తీసుకుని, పెయిన్ కిల్లర్స్ సాయంతో మళ్లీ ఈ రోజు షూటింగ్ కు రెడీ అయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకదానికి ఉపేంద్ర అనే కొత్త దర్శకుడు, మరోదానికి జయేంద్ర డైరెక్షన్లో చేస్తున్నాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల