సినిమాలకు వీడ్కోలు చెప్పేస్తానంటున్న పవన్ కళ్యాణ్
- December 08, 2017
విజయవాడ: విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సమావేశంలో మాట్లాడుతూ...పరిటాల రవి నాకు గుండు కొట్టించాడనేది పచ్చి అబద్ధం అని పవన్ స్పష్టం చేశారు. అది టిడిపి వాళ్లు సృష్టించిన ప్రచారం అని పవన్ కొట్టిపారేశారు. సినిమాలపై చికాకు వచ్చి నేనే గుండు కొట్టించుకున్నానని పవన్ తెలిపారు. ఈ ప్రచారం మొదలైనప్పుడు పరిటాల రవి ఎవరో నాకు తెలియదని పవన్ పేర్కొన్నారు. ప్రజల కోసమే టిడిపికి మద్దతిచ్చాను. వైఎస్ జగన్పై అభియోగాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి నేను ఎందుకు మద్దతిస్తానని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కంటే ఏపిలో కుల పిచ్చి ఎక్కువగా ఉందని, ఈమేరకు కుల పిచ్చి వదుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని పవన్ పేర్కొన్నారు. నిరాయధుడిగా ఉన్న రంగాను చంపడం తప్పని, రంగా ప్రస్తావన లేకుండా బెజవాడ రాజకీయాలు లేవని పవన్ వెల్లడించారు. ఇక సినిమాలు వదిలేస్తున్నానని పవన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







