కువైట్ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థికి స్కాలర్ షిప్

- December 08, 2017 , by Maagulf
కువైట్ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థికి స్కాలర్ షిప్

కువైట్ : కువైట్ విశ్వవిద్యాలయం ఓ భారతీయ విద్యార్థి ప్రతిభకు పట్టం కట్టనుంది.12 వ తరగతిలో అత్యధిక మార్కులు పొందిన భారతీయ విద్యార్ధికి  ఉపకారవేతనం పొందే అవకాశంను కువైట్ ప్రభుత్వం కల్పించింది. విశ్వవిద్యాలయం 2017-18  రెండవ విద్యా సంవత్సరంకు సంబంధించి ఈ సదుపాయం కల్పించనుంది.12 వ గ్రేడ్ బోర్డు పరీక్షల ఉత్తీర్ణత పొందిన వారు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు. ఈ మేరకు కువైట్ యూనివర్శిటీ నుండి దరఖాస్తుపత్రాన్ని పొందవచ్చు. భారతదేశం యొక్క ఎంబసీ యొక్క ఎడ్యుకేషన్ విభాగానికి పూర్తిచేసిన దరఖాస్తును డిసెంబరు 28 వ తేదీ లోపున సమర్పించవచ్చు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే 12 వ తరగతి లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థికి  సంబంధిత కువైట్ లోని భారత రాయబార అధికారులు సిఫార్సు చేయాలనీ కోరింది..స్కాలర్ షిప్ విద్యార్ధి  పొందే విద్యా అర్హత పరీక్షను కువైట్ విశ్వవిద్యాలయం 2018 జనవరి 29, సోమవారం నిర్వహించబడుతుంది. తదుపరి విచారణలకు, ఆసక్తి గల విద్యార్ధులు మరింత సమాచారం కొరకు  శ్రీ సంజీవ్ సక్లని, అటాచీ (విద్య / కాన్యులర్) ఆఫీస్ టెలిఫోన్ నంబర్ 22522215 మరియు మొబైల్ నెంబర్  97295728  సంప్రదించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com