మరిజువానా, ఖాత్ స్మగ్లింగ్: ముగ్గురి అరెస్ట్
- December 09, 2017
మస్కట్: మస్కట్, సలాలా విమానాశ్రయాల్లో ఇద్దరు వ్యక్తుల్ని మరిజువానా స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. డైరెక్టరేట్ జనరల్ ఫర్ ది నేషనల్ కంట్రోల్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సోకైట్రోపిక్ సబ్‌స్టాన్సెస్, మస్కట్ ఎయిర్పోర్ట్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు యత్నించిన వలసదారుడ్ని అరెస్ట్ చేసి, అతన్నుంచి 7 కిలోల మరిజువానాని స్వాధీనం చేసుకున్నారు. దోఫార్‌లో, సలాలా ఎయిర్పోర్ట్ ద్వారా సుల్తానేట్‌లోకి మరిజువానాతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకో ఘటనలో దోఫార్ పోలీసులు, ఒమనీ సిటిజన్ని నార్కోటిక్ సబ్‌స్టాన్సెస్‌ని స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. అతన్నుంచి 318 ప్యాకెట్ల ఖాత్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







