రానా తో మరో మల్టీస్టారర్ మూవీ తీయనున్న కృష్ణవంశి

- December 09, 2017 , by Maagulf
రానా తో మరో మల్టీస్టారర్ మూవీ తీయనున్న కృష్ణవంశి

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు గులాబీ, మురారి, ఖడ్గం,చందమామ లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన కృష్ణ వంశి గత కొంత కాలంగా పెద్దగా విజయాలు అందుకోలేక పోతున్నారు. ఆ మద్య మెగా అబ్బాయి రాంచరణ్ తో తీసిన సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' కథ పరంగా బాగుందీ అనిపించుకున్నా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఈ సంవత్సరం 'నక్షత్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
 
కాకపోతే ఈ సినిమా గత సంవత్సరం నుంచి వాయిదాలు పడుతూ..సినిమా పై ఉన్న అంచనాలు తగ్గిపోయాయి. దీంతో థియేటర్లో 'నక్షత్రం' పెద్దగా అలరించలేక పోయింది. సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్ లు కలిసి నటించిన ఈ సినిమా అంచనాలు తలకిందులు చేసింది. ఇక ఆయన నుంచి మరో సినిమా రావడానికి చాలా సమయం పట్టొచ్చని అనుకున్నారు. అయితే ఇప్పుడు కృష్ణవంశి మరో అద్భుతమైన మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట.
 
ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్న ఆయన, ఒక హీరోగా మాధవన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా చెబుతున్నారు. బాహుబలి సిరీస్ తో జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడు. మాధవన్ .. రానా పాత్రలు నువ్వా .. నేనా? అన్నట్టుగా ఉంటాయట. ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తారట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com