చికెన్ పొట్లి
- December 09, 2017కావలసిన పదార్ధాలు:
బోన్‌లెస్ చికెన్- 250 గ్రా (ఉడికించి గ్రైండ్‌చేయాలి), బీన్స తరుగు, క్యారెట్ తరుగు, ఉల్లికాడల తరుగు - 3 టీ స్పూన్ల చొప్పున, టొమాటో - 1(తరగాలి), సోయాసాస్ - 2 టీ స్పూన్లు, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నల్ల మిరియాలు - 5, మైదా - 3 టేబుల్ స్పూన్లు, పాలు - కప్పు, నిమ్మరసం - టీ స్పూన్.
తయారీ పద్ధతి:
మైదాను పాలతో చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి. పానలో నూనె వేడయ్యాక క్యారెట్, బీన్స, ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి. తర్వాత అందులో చికెన్, టొమాటో, సోయాసాస్, ఉప్పు, మిరియాలు కలిపి కొద్దిగా వేగనివ్వాలి. మైదాపిండిని చిన్న పూరీలా చేసుకుని అందులో చికెన్ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి, ఉల్లికాడలతో మూటలా కట్టి పొట్లీని తయారుచేయాలి. ఇలా తయారుచేసుకున్న పొట్లీలను ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి. వీటిని సాస్‌తో వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- యూఏఈ-ఇండియా ట్రావెల్..విమానాలు పెరగకపోతే 'ధరలు పెరుగుతూనే ఉంటాయి'..!!
- డిస్నీల్యాండ్‌ను ఓడించిన అబుదాబికి చెందిన యాస్ ఐలాండ్..!!
- మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
- రూ.300కే ఇంటర్నెట్ సేవలు–తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- చెత్త ఎయిర్ లైన్స్ జాబితాలో 103వ స్థానం పొందిన ఇండిగో ఎయిర్‌లైన్
- దుబాయ్ లో 30% ఆల్కహాల్ అమ్మకపు పన్ను పునరుద్ధరణ..!!
- కువైట్ లో అంతర్జాతీయ 'ఫుట్‌బాల్ ఫర్ పీస్' కార్యక్రమం..!!
- అబుదాబిలో డ్రైవర్ లెస్ ఉబర్ సేవలు..ఎలా బుక్ చేయాలంటే..?
- మోటార్‌సైకిలిస్ట్ దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు..!!
- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారికి బిగ్ అలెర్ట్!