బాలికపై వేధింపులు: దుబాయ్ ఎయిర్‌పోర్ట్ వర్కర్‌కి జైలు
- December 09, 2017
దుబాయ్:19 ఏళ్ళ బాలికప లైంగిక దాడికి యత్నించేందుకు ప్రయత్నించిన 27 ఏళ్ళ దుబాయ్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ వర్కర్‌కి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జనవరిలో బ్రిటిష్ హాలీడే మేకర్ అయిన 19 ఏళ్ళ బాలిక దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తాను వెళ్ళాల్సిన విమానం కోసం ఎదురుచూస్తుండగా, 27 ఏళ్ళ ఆసియాకి చెందిన వ్యక్తి ఒకరు ఆమెను గుర్తించి, ఆమెకు కాఫీ ఆఫర్ చేశాడు. విమానం ఆలస్యమవుతుందన్న విషయాన్ని తెలుసుకున్న ఆ వర్కర్, ఆమెను హోటల్ రూమ్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ ఆమె రెస్ట్ తీసుకుంటున్న సమయంలో హెయిర్‌ని టచ్ చేశాడు. ఆ తర్వాత ఆమె మోకాలి భాగాన్ని టచ్ చేశాడా వ్యక్తి. ఆమె ఆగ్రహంతో ఊగిపోవడంతో, నిందితుడు ఆమెకు అక్కడే క్షమాపణ చెప్పాడు. అయితే ఆమె బయటకు వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మూడు నెలల జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని డిపోర్ట్ చేయనున్నారు. విచారణలో నిందితుడు, ఆమెను నిద్ర లేపేందుకే టచ్ చేసినట్లు చెప్పాడు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







