డిసెంబర్ 28న "ఒక్క క్షణం"
- December 09, 2017
శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంటగా, డిమానిటైజేషల్ లో కూడా బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బస్టర్ అందించిన చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో.... సినిమా నిర్మించడంలో ఎక్కడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ కోసమే పరితపించే లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ పై.... , సినిమా అంటే ప్యాషన్ తో మంచి చిత్రాలు నిర్మించే చక్రి చిగురుపాటి నిర్మాతగా నిర్మించిన చిత్రం ఒక్క క్షణం. ప్రముఖ నటుడు శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్ జంటగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావటమే కాకుండా జెన్యూన్ ఆడియన్స్ నుండి దాదాపు 2 మిలియన్స్ వ్యూస్ రావటం ఈ టీజర్ స్టామినాకి నిదర్శనం. సోషల్ మీడియాలో ఈ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు అనూహ్యంగా ఇతర రాష్ట్రల్లో కూడా యూట్యూబ్ ట్రెండింగ్ అవ్వడం అశ్చర్యానికి గురిచేసింది. ఈనెల 8న .. సోమెని సోమెని తలపులే... అని మెదలయ్యే సాంగ్ విడుదల చేశారు... ఈ సాంగ్ ని మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరపరిచారు. విడుదల చేసిన తక్కువ టైంలో ఈ సాంగ్ ఆకట్టుకోవడం చిత్ర యూనిట్ కి మాంచి బూస్ట్ ఇచ్చింది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
నటీనటులు - అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్, కాశి విశ్వనాథ్, రోహిణి, జయప్రకాష్, ప్రవీణ్, సత్య, సుదర్శన్, వైవా హర్ష, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, బిల్లి మురళి, రవి వర్మ, శ్రీసుధ, చిత్రం భాషా, భిందు, ప్రణవ్, బద్రం తదితరులు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







