ఉగ్రవాదాన్ని సహించేది లేదు...రష్యా, ఇండియా, చైనా స్పష్టీకరణ

- December 11, 2017 , by Maagulf
ఉగ్రవాదాన్ని సహించేది లేదు...రష్యా, ఇండియా, చైనా స్పష్టీకరణ

న్యూదిల్లీ: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న సహించేది లేదని, దాన్ని నిరోధించేందుకు కలిసికట్టుగా పోరాడతామని భారత్‌, రష్యా, చైనా స్పష్టంచేశాయి. మూడు దేశాల విదేశాంగ మంత్రుల 15వ సమావేశం అనంతరం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తాము ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి సంఘటితం కాలేదని, అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చాయి.

అంతకుముందు రష్యా, ఇండియా, చైనా (ఆర్‌ఐసీ కూటమి) విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ తో సుష్మాస్వరాజ్‌ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలపై చర్చించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లావ్రోవ్‌తోనూ సుష్మ విడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచే అంశాలపై చర్చించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com