మూత్ర విసర్జన కాలం ఎంత వుండాలో తెలుసా?
- December 11, 2017
మనిషి సగటున రోజుకు ఏడుసార్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఏడుసార్ల కంటే ఎక్కువగా లేదా తక్కువగా మూత్ర విసర్జన చేస్తే ఏదో తెలియని అనారోగ్యం వున్నట్లే. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన కాలం దాదాపు ఏడు సెకన్ల వరకూ వుంటుంది. మూత్ర విసర్జన చేయాలనిపించినపుడు మూత్రానికి వెళితే రెండు సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయంలోపలే మూత్ర విసర్జన పూర్తయితే వారికి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పుకోవచ్చు.
మన తీసుకునే ఆహారాన్ని శరీరం వివిధ రకాలుగా విడగొడుతుంది. ఇలా విడగొట్టబడిన ఆహారంలో శరీరం వివిధ పోషకాలను గ్రహించి మిగిలిన వ్యర్థాలను మూత్రం, మల రూపంలో విసర్జిస్తుంది. ఇక మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని చెప్పొచ్చు. మీ మూత్రం తెల్లగా స్వచ్ఛంగా ఉంటే మీరు శరీరానికి సరిపోయినన్న నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం ఎరుపు రంగులో వస్తే దీనికి కారణం మూత్రంలో రక్తం కలిసి విసర్జితమవ్వడం. ఇది చాలా సంధర్భాల్లో యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గా మారుతుంది. మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తం పోకపోవచ్చు గాని దీన్ని ఒక సమస్యగా తీసుకోవాలి.
కొంతమందికి మూత్రం నీలంరంగులో వస్తుంది. ఇది పసిపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని బ్లూ సైపన్ సిండ్రోమ్ అంటారు. ఇది జన్యులోపం కారణంగా వస్తుంది. పెద్దవారిలో ముఖ్యంగా వయాగ్రా వాడే పురుషుల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రం నలుపు రంగులో ఉంటుంది. మూత్రం జేగురు రంగులో వస్తే చర్మం, మెడ ఇన్ఫెక్షన్ల ప్రభావం కిడ్నీ మీద పడిందని అర్థం. ఇలాంటి పరిస్థితి పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. యాంటీ బయాటిక్ వాడడం ద్వారా దీని నుంచి బయట పడవచ్చు. డీహైడ్రేషన్ కు లోనయితే అది ముదురు రంగులోకి మారుతుంది. లివర్ సమస్యలు, కామెర్ల సమస్యలు ఉంటే మూత్రం ముదురు పసుపురంగులోకి వస్తుంది. కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా మూత్రం పసుపు రంగులో వస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







