న్యూజెర్సీలో సందడి చేయనున్న అఖిల్, రానా
- December 12, 2017
అక్కినేని అఖిల్, రానా న్యూజెర్సీ వెళ్లారు. ఈ సందర్భంగా అఖిల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం హలో మూవీ ప్రమోషన్స్‌లో అఖిల్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో తన సినిమాను ప్రమోట్ చేసిన అఖిల్ ప్రస్తుతం అమెరికాకు బయల్దేరాడు. అఖిల్ రీ లాంచ్ అవుతున్న మూవీ హలో. దీన్ని ఓవర్సీస్లో ప్రమోట్ చేయాలని ఈ యంగ్ హీరో డిసైడ్ అయ్యాడు. దీంతో మూడు రోజుల యూఎస్ టూర్‌ను ప్లాన్ చేసుకున్నాడు.
ఈ నెల 15, 16, 17 తేదీల్లో అక్కడ ప్రమోషనల్ క్యాంపెయిన్ ఉండబోతోంది. అఖిల్ న్యూజెర్సీ, డల్లాస్‌లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. దీనికోసం అఖిల్‌తో పాటు రానా కూడా యూఎస్ పయనమయ్యారు. అఖిల్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన పిక్‌లో రానా కూడా కనిపిస్తున్నాడు. దీంతో అటు అక్కినేని, ఇటు దగ్గుబాటి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా సక్సెస్‌పై అఖిల్, నాగార్జున చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







