రజనీని చూసి బిచ్చగాడనుకుని పది రూపాయలు వేసిన మహిళ
- December 11, 2017
రజినీకాంత్ కు ఉన్న ఫేస్ వాల్యూతో స్టార్డమ్ రావడం అసాధ్యం.. కానీ ఆత్మవిశ్వాసం, డిసిప్లిన్ తో సాధించాడు.. ఎన్ని విజయాలు వచ్చినా ఇప్పటికీ నేలమీదే నించోవడం రజినీని మాస్ తో పాటు క్లాస్ కూ దగ్గర చేసింది. ఇది ఏ అప్ కమింగ్ హీరో అయినా నేర్చుకోవాల్సిన ఫస్ట్ క్వాలిటీ.. ఆ విషయంలో రజినీ తర్వాతే ఇంకెవరైనా.. అందగాడు కాదు.. అభినయంలో ఆరితేరలేదు.. అసలు అతను నటుడు అంటే ఆశ్చర్యం కాదు.. విచిత్రం అనిపిస్తుంది.. ఇన్ని నెగెటివ్ క్వాలిఫికేషన్స్ ఉన్నా నటుడు కావాలనుకున్నాడంటే అతనిలో ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి... ఎంత నమ్మకం ఉండాలి.. అవును వాటిని ఆలంబనగా చేసుకునే అంతులేని పోరాటం చేశాడు. రజనీకాంత్ స్టైలే వేరు. కానీ ఇది సినిమాల్లో మాత్రమే. బయట ఓ సాధారణ వ్యక్తి. సినిమా రంగలో ఒక్కోతరాన్ని ఒక్కొక్కరు ప్రభావితం చేస్తారు... కానీ రజినీకాంత్ ఎదిగిన విధానం ఎన్ని తరాలకైనా ఆదర్శమే. ఏమీ లేని వాడుగా వచ్చి.. ఎంతో సాధించిన రజినీ జర్నీ.. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆదర్శనీయమే.
వెండితెరపై రారాజుగా నిలిచినా.. ఆయన మేకప్ లో ఉన్నంతసేపు మాత్రమే నటిస్తాడు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ వున్న రజనీ ఓ సారి బెంగుళూరులోని దేవాలయానికి వెళ్లాలనుకున్నాడు కానీ బాగా రద్దీగా ఉంది అని సన్నిహితులు చెప్పారు. అయినా వినకుండా పాత లుంగీ, పాత షర్టు ధరించి ఓ పేద వృద్ధుడిలా గుడికి వెళ్లారు. ఆయన్ని చూసిన ఓ గుజరాతీ మహిళ బిచ్చగాడనుకుని పదిరూపాయలు రజనీ చేతిలో పెట్టింది. ఏమీ చెప్పకుండా రజనీ ఆ నోటు తీసుకుని గుడిలోకి వెళ్లాడు. అతడ్ని అనుసరించిన గుజరాతీ మహిళ రజనీ దేవుడి హుండీలో వంద రూపాయలు వేయడం చూసి ఆశ్చర్యపోయింది. తన తప్పు తెలుసుకున్న మహిళ తానిచ్చిన పది రూపాయల్ని తిరిగి ఇమ్మని అడిగింది. కానీ రజనీ దానికి ఒప్పుకోలేదు. ఇలాంటి సందర్భాల్లోనే నేనేంటో నాకు తెలుస్తుంది. నా స్థాయిని గుర్తుచేయడానికే దేవుడు మీతో అలా చేయించి ఉంటారు అని ఆ మహిళకి సర్దిచెప్పారు రజనీ. ఇది రజనీ నిరాడంబరతకు అద్దం పట్టే ఓ చిన్న సంఘటన మాత్రమే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల