స్వాధీనం కాబడిన 500 పైగా వాహనాలను ఆయా యజమానులకు విడుదల

- December 12, 2017 , by Maagulf
స్వాధీనం కాబడిన 500 పైగా వాహనాలను ఆయా యజమానులకు విడుదల

కువైట్ : ఫెర్వనియా గవర్నరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన పలు వాహనాలను వాహన నిర్బంధ విభాగం ఇటీవల స్వాధీనం చేసుకొంది. ప్రస్తుతం  సంబంధిత వాహన యజమానులు విధించబడిన  జరిమానాలను పరిష్కరించుకున్నారు. దీంతో 500 పైగా వాహనాలను వాహన నిర్బంధ విభాగం విడుదల చేసింది. అల్-ఖాబాస్ దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఏ ఒక్కరితో ఎటువంటి ప్రధాన సమస్యలు తలత్తేకుండా వారి విధులను సక్రమంగా నిర్వర్తించడంలో అధికారులు చక్కని కార్యదక్షత ప్రదర్శించారని ప్రశంసించింది. నగరాన్ని చూసేందుకు వచ్చిన సందర్శకులు వారి పత్రాలను పరిశీలించడానికి వారిని నేరుగా  సంబంధిత యూనిట్లకు మార్గనిర్దేశం చేశారు. ట్రాఫిక్ చట్టం169 ఆర్టికల్ అమలు తర్వాత ట్రాఫిక్ ప్రచారాలు తీవ్రతరం అయ్యాయి. పార్కింగ్ కానీ లేదా పాదచారులకు మరియు కాలిబాటలకు ప్రత్యేక ప్రదేశాలలో వాహనాలను నిషేధం అమలుచేయబడుతుంది. డ్రైవింగ్ చేసేసమయంలో ఒక చేతితో ఫోన్ మాట్లాడటం  ఆర్టికల్ 207 లో ట్రాఫిక్ నేరంగా పరిగణించబడుతుంది. అలాగే వాహనంలో ముందు సీట్లలో కూర్చున్నవారు  సీట్ బెల్ట్  అమర్చుకోకపోవడం మరియు ద్విచక్రవాహనదారులు శిరస్త్రాణాలు ( హెల్మెట్స్ ) ధరించకపోయిన వారిపై ట్రాఫిక్ చట్టం అమలు కాబడుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com