నాసా: మరో రెండు రోజుల్లో వీడనున్న ఏలియెన్స్ మిస్టరీ
- December 12, 2017
గ్రహాంతర వాసుల ఉనికి మీద ఏళ్ళతరబడి ప్రపంచ ప్రజలను, శాస్త్రజ్ఞులను ఊరిస్తున్న సస్పెన్స్ ఈ నెల 14 న వీడనుంది. మరో రెండు రోజుల్లో ఈ మిస్టరీకి తెరపడబోతోంది.. ఏలియెన్స్ గుట్టును గురువారం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా విప్పేస్తుందట. ఆ రోజు లైవ్‌గా నిర్వహించనున్న కాన్ఫరెన్స్‌లో.. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించిన విషయాలను శాస్త్రజ్ఞులు వెల్లడించనున్నారు.
ఈ టెలిస్కోప్ 2009 నుంచే గ్రహాంతరవాసుల జాడ కోసం అన్వేషిస్తోంది. ఇది అందించిన డేటాను గూగుల్ మెషిన్ లెర్నింగ్ సాయంతో విశ్లేషించారు. ఈ మెషిన్...ఓ కృత్రిమ ఇంటలిజెన్స్ అని, కెప్లర్ డేటాను విశ్లేషించడానికి ఇది తోడ్పడిందని నాసా ప్రకటించింది.
ఈ నెల 14 న జరిగే కాన్ఫరెన్స్ లో నాసా ఆస్ట్రో ఫిజిక్స్ డివిజన్ డైరెక్టర్ పాల్ హెర్జ్, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ క్రిస్టఫర్ షాల్యూ, నాసా సాగన్ పోస్ట్ డాక్టోరల్ ఆస్త్రనమర్ ఆండ్రూ వాండర్ బర్గ్, నాసా కెప్లర్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త జెస్సీ డాట్స న్ పాల్గొని గ్రహాంతరవాసుల మిస్టరీని ఈ ప్రపంచానికి వివరించనున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







