ప్రపంచ తెలుగు మహాసభల్లో 200 పుస్తకాల ఆవిష్కరణ
- December 12, 2017
ప్రపంచ తెలుగు మహాసభల్లో సుమారు 200 కొత్త పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వందకు పైగా పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. వివిధ సంస్థలు, రచయితలు, కవులు రాసిన పుస్తకాలను ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో 14 కొత్త పుస్తకాలను తీసుకొస్తున్నారు. తెలంగాణలో పద్య కవితావైభవం (గండ్ర లక్ష్మణ్‌రావు), తెలంగాణలో నవవికాసం (కాసుల ప్రతాప్‌రెడ్డి), తెలంగాణ సామెతలు (చైతన్య ప్రకాశ్), ఈగ బుచ్చిదాసు సంకీర్తనా చార్యులు (యాదగిరి నర్సింహాస్వామి), తెలంగాణలో భావ కవిత్వం (సామిడి జగన్‌రెడ్డి), మాదిరెడ్డి రామకోటేశ్వర్‌రావు స్వీయచరిత్ర, 'తెలంగాణ సోయి' పత్రిక వ్యాసాల సంకలనం, బ్రిటీష్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు, తెలంగాణ సినీగేయ ప్రస్తావన (కందికొండ), మందార మకరందాలు... తదితర పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు.
తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో...
తెలుగు యూనివర్సిటీ ఆధ్వరంలో నాలుగు లఘు గ్రంథాలను ఆవిష్కరిస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం, తెలంగాణ చైతన్యం, బంజారా తీజ్, జానపద గిరిజన అధ్యయనం తదితర లఘు గ్రంథాలతో పాటు వాగ్మయ ప్రత్యేక సంచిక, తెలుగువాణి ప్రత్యేక సంచిక, తెలుగు మహాసభల ప్రత్యేక సంచికలను తీసుకొస్తున్నారు.
అకాడమీ ఆధ్వర్యంలో...
తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో 62 లఘు గ్రంథాలను విడుదల చేస్తున్నారు. మఖ్దూం మొహియుద్దీన్, వేపూరి హనుమద్దాసు, పొట్లపల్లి రామారావు, దాశరథి రంగాచార్య, పీవీ నర్సింహారావు, కొండా లక్ష్మణ్‌బాపూజీ, సి.నారాయణరెడ్డి, సాహు, మిద్దె రాములు, బోయ అంజయ్య, వట్టికోట అళ్వార్‌స్వామి, కాళోజీ, రావి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, అరుట్ల రామచంద్రారెడ్డి, చిందుల ఎల్లమ్మ, సురవరం ప్రతాప్‌రెడ్డి, జ్వాలాముఖి, షోయబుల్లా ఖాన్, మునిపంతుల, చాకలి ఐలమ్మ... వంటి మహనీయుల జీవిత చరిత్రలను లఘుగంథ్రాల రూపంలో తీసుకొస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







