నగర వాసుల్ని కలిసి బాదేద్దాం.. మెట్రో ఓలా చెట్టపట్టాల్
- December 13, 2017
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ ఓలా క్యాబ్స్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 'టీసవారి' అంటూ ఓ యాప్‌ని ప్రయాణీకుల ముందుకు తెచ్చింది. ఈ యాప్‌లో ఓలా మనీతో పాటు ఓలా సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ నుంచే ఓలాకు సంబంధించిన వాహనాల్ని బుక్ చేసుకోవచ్చు. మెట్రో స్మార్ట్ కార్డులను కూడా ఓలా మనీ వ్యాలెట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మెట్రో రైల్ సీఈవో అనిల్ కుమార్ శైనీ మాట్లాడుతూ, ఓలాతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని, ఈ సదుపాయం వల్ల ప్రయాణికులకు స్టేషన్‌కు రావడానికి, వెళ్లడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. ఊహించినట్లుగానే మెట్రోకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







