ఒక్క రూపాయితో విమానం ఎక్కేయొచ్చు.. చక్కర్లు కొట్టేయొచ్చు

- December 13, 2017 , by Maagulf
ఒక్క రూపాయితో విమానం ఎక్కేయొచ్చు.. చక్కర్లు కొట్టేయొచ్చు

డెక్కన్ ఎయిర్ వేస్ ఓ శుభవార్త చెప్పింది. విమానం ఎక్కాలన్న కోరికను తీర్చేస్తానంటోంది. బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు ఎగ్గొట్టి విదేశాలు చెక్కేసిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విలీనం, సంక్షోభం వీటి మధ్య 2012లో తన కార్యకలాపాలు మూసివేసింది. ఇప్పుడు మళ్లీ ఈ ఎయిర్ లైన్స్ వెలుగులోకి వచ్చి కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. తమ కస్టమర్లకు రూ.1కే విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ విమానం ఈనెల 22న గాల్లోకి ఎగరనుంది. నాసిక్ నుంచి ముంబైకి ఈ సర్వీసును ప్రారంభించనున్నామని కెప్టెన్ గోపీనాథ్ తెలిపారు. అదృష్టవంతులు ఎవరో టిక్కెట్‌ని చేజిక్కించుకోమంటుంది. ముందు వచ్చిన వారికే అవకాశం అంటూ ఇందులో ఉన్న మతలబు తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com