బేబీకార్న్‌ తాలింపు

బేబీకార్న్‌ తాలింపు

కావల్సినవి: బేబీకార్న్‌ ముక్కలు - రెండుకప్పులు, ఉల్లిపాయలు - రెండు, ఆవాలు - చెంచా, కరివేపాకు రెబ్బలు - రెండు, జీలకర్ర - చెంచా, కారం - చెంచా, ధనియాలపొడి - అరచెంచా, ఉప్పు - తగినంత, జీలకర్ర పొడి - చెంచా, కొత్తిమీర - కట్ట, సెనగపిండి, మొక్కజొన్న పిండి - పెద్ద చెంచా చొప్పున, నూనె - వేయించేందుకు సరిపడా, పసుపు - అరచెంచా.   

తయారీ: బేబీకార్న్‌ ముక్కల్ని ఓ గిన్నెలోకి తీసుకుని అవి మునిగేవరకూ నీళ్లు పోసి పసుపు వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి ఉడికాక దింపి నీళ్లు వంపేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలపై తగినంత ఉప్పూ, కొద్దిగా కారం, మొక్కజొన్నపిండీ, సెనగపిండీ వేసుకుని అన్నింటినీ కలపాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అవి వేగాక ఈ బేబీకార్న్‌ ముక్కల్ని వేసి.. కరకరలాడేలా వేయించుకుని తీసుకోవాలి. మరో బాణలిలో రెండు చెంచాల నూనె వేసి దాన్ని పొయ్యిమీద పెట్టాలి. అందులో ఆవాలూ, ఉల్లిపాయముక్కలూ, కరివేపాకూ, జీలకర్ర వేయాలి. రెండు నిమిషాలయ్యాక వేయించి పెట్టుకున్న బేబీకార్న్‌ ముక్కలూ, మిగిలిన కారం, ధనియాలపొడీ, జీలకర్రపొడీ, కొత్తిమీర వేసుకుని బాగా వేయించి తీసుకుంటే చాలు.

Back to Top