ఇది వంద అనారోగ్యాలను రానివ్వదు
- December 15, 2017
పోషకాహార లేమితో బాధపడే వారికి తేనె దివ్య ఔషధం. తేనెను ప్రతిరోజు తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలు దరికిరావని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. తేనెలో విటమిన్ సితో పాటు ప్రొటీన్స్, ఆమైనోఆమ్లాలు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, సోడియం, వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్రక్రోజ్ 38 శాతం, గ్లూకోజ్ 31శాతం, సుక్రోజ్ 1 శాతం, నీరు 17శాతం ఇతరత్రా చక్కెరలు 9 శాతం ఉంటాయి. పంచదారతో పోలిస్తే తేనెలో కేలరీలు ఎక్కువ. తేనెలోని పిండి పదార్థాలు సులభంగా గ్లూకోజ్‌గా మారిపోవడంతో తేలిగ్గా జీర్ణ మౌతాయి. వేడినీటిలో ఒక స్పూను తేనె, దాల్చిన చెక్క పొడి వేసి, బాగా కలిపి, ఆ నీటిని కొద్దిసేపు పుక్కిలిస్తే నోటి దుర్వాసన పరారవుతుంది. తేనె, దాల్చిన చెక్క పొడిని కలిపి బ్రెడ్ స్లైస్ మీద రాసుకుని తీసుకుంటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఈ విధంగా రోజుకు మూడు పూటలా తింటే క్యాన్సర్ దరికిరాదు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు తేనె, దాల్చిన చెక్కల మిశ్రమం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తేనె సూక్ష్మజీవుల సంహారిణి. బాక్టీరియా, ఈస్ట్ వంటి సూక్ష్మజీవులను ఎదగనివ్వదు. తేనెలోని కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని అందిస్తాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల