విఐపి ఉచిత దర్శనాల పై మండిపడుతున్న శ్రీవారి భక్తులు
- December 15, 2017
లియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కమిటీల భారం ఎక్కువైంది. ప్రోటోకాల్ పేరుతో వందల మంది ఉచిత దర్శనాలు చేసుకుంటూ స్వామివారి ఆదాయానికి గండికొడుతున్నారు. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ మూర్తి మరో ముగ్గురితో కలిసి వెంకన్న దర్శనానికి వచ్చారు. వీరితో పాటు దాదాపు వంద మంది L 1 దర్శనాలు చేసుకున్నారు. వారందరికీ టీటీడీ అధికారులు సముచిత మర్యాదలు చేశారు. ఈ తతంగంపై భక్తులు మండిపడ్డారు. కమిటీల పేరుతో వచ్చిన వారితో తమకు దర్శనం ఆలస్యం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతులు చెప్పేవారే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు.
గడచిన వారం రోజుల్లోనే నాలుగు కమిటీలు తిరుమలకు విచ్చేశాయి. అసలు సభ్యులు ఇద్దరు ముగ్గురుంటే... వారితో వచ్చేవారు వందమంది దాకా ఉంటున్నారు. వారందరికీ వసతి, దర్శనాలు, ప్రసాదాలు కూడా ఉచితంగా అందించాల్సి వస్తోంది. దీంతో అనవసర ఇబ్బందులు తలెత్తడంతో పాటు... టీటీడీ ఆదాయానికీ గండి పడుతోంది. కమిటీల పేరుతో సాగుతున్న ఈ తంతుపై భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వమే దీనిపై దృష్టిసారించి... కఠిన నియమావళి రూపొందించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







