పూతరేకుల అర్థం తెలుసుకున్న కేసీఆర్
- December 15, 2017
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నప్పుడు భాషా పరమైన ఇబ్బందులు ఎదుర్కున్నట్లు దానికి సంబంధించిన సంఘటనను ప్రపంచ తెలుగు మహాసభల్లో చెప్పుకొచ్చారు. ఓ చిత్రంలో శోభన్ బాబు పూత రేకుల లేత సొగసు అంటూ పాడతాడు. అది చూసిన నేను పూత రేకులు అంటే ఏమిటో తెలుసుకోవాలని థియేటర్ బయట పాటల పుస్తకాలు అమ్ముతుంటే పుస్తకాన్ని కొని అర్థాన్ని వెతికాను. తియ్యదనం అని అందులో ఉంది. మరుసటి రోజూ స్కూల్‌కి వెళ్లినప్పుడు మాష్టారిని కూడా అడిగాను. ఆయన కూడా మరో అర్థం చెబుతూ, ఆ పదానికి అర్థం విజయవాడలోని ముదిగొండ వీరభద్రయ్యగారిని అడిగి చెబుతానని వారికి ఉత్తరం రాశారు. దానికి ఆయన కూడా తియ్యదనం అని ప్రత్యుత్తరం రాసి పంపించారు. తెలుగు భాష వికసించాలంటే ఒక భాషా పండితుడు మరో భాషా పండితుడిని, ఒక కవి మరో కవిని తయారు చేయాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







