పన్నీర్ పరోటా
- December 18, 2017
కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి - రెండున్నర కప్పులు
నీళ్లు - తగినన్ని , నెయ్యి లేదా నూనె - 1 టీస్పూను ,ఉప్పు - తగినంత.
స్టఫింగ్ కోసం: పన్నీర్ - 200 గ్రా , పచ్చిమిర్చి తరుగు - 2 టీస్పూన్లు
కారం - అర టీస్పూను,గరం మసాలా పౌడర్ - అర టీస్పూను.
ఆమ్‌చూర్ -అర టీస్పూను,ఉప్పు - తగినంత
నెయ్యి లేదా నూనె - తగినంత.
తయారీ విధానం:
గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి వేసి కలపాలి.
నీళ్లు పోస్తూ పిండి ముద్దగా చేసుకోవాలి. ముద్ద చేసుకున్న తర్వాత మూత పెట్టి 30 నిమిషాలు నాన బెట్టుకోవాలి. ఈలోగా స్టఫింగ్ తయారుచేసుకోవాలి.
పచ్చిమిర్చి, ఆమ్‌చూర్, గరం మసాలా, కారం, ఉప్పు, పన్నీర్ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. పిండి ముద్ద ఉండలుగా చేసుకుని పరోటా ఒత్తుకోవాలి.
పరోటా పైన స్టఫింగ్ పరుచుకోవాలి. మరీ అంచులవరకూ కాకుండా ఒక అంగుళం గ్యాప్ ఉంచి స్టఫింగ్ పరుచుకోవాలి. తర్వాత పైన మరో పరోటా ఉంచి అంచులు కలుపుకోవాలి.
తర్వాత పిండి చల్లి మరోసారి ఒత్తుకోవాలి. ఇలా అన్నీ తయారుచేసి పెట్టుకున్న తర్వాత పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







