ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది
- November 18, 2015
పారిస్‌లో నరమేధానికి పాల్పడిన ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది. ఒకవైపు.. బాధిత దేశం ఫ్రాన్స్ ముమ్మరంగా దాడులు జరుపుతుండగా, మరోవైపు రష్యా కూడా దాడులు ప్రారంభించింది. ఇందులోభాగంగా.. సిరియాలోని రఖాపై వైమానిక దాడులు జరిపింది. ఐఎస్‌కు అప్రకటిత రాజధానిగా చలామణి అవుతున్న రఖాలోని ఉగ్రవాదుల కమాండ్ సెంటర్, శిక్షణ కేంద్రంపై మంగళవారం బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేసింది. ఐఎస్ స్థావరాలపై 24 గంటల్లో ఇది రెండో వైమానిక దాడి అని ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అమెరికా సేనలతో కలిసి జరిపిన ఈ దాడిలో 10 రాఫెల్, మిరేజ్-2000 యుద్ధ విమానాలతో 16 బాంబులు వేసినట్లు పేర్కొన్నది. కాగా దాడుల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న యుద్ధ విమానాలకు తోడు చార్లెస్ డి గాలే యుద్ధనౌకను కూడా చేర్చాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







