ఫిషర్మెన్ని సన్మానించిన రాయల్ ఒమన్ పోలీస్
- December 21, 2017
మస్కట్: తగలబడిపోతున్న బోటు నుంచి తొమ్మిది మందిని రక్షించిన ఘటనలో 'హీరో'గా అందరి ప్రశంసలు అందుకున్నఫిషర్మెన్ని రాయల్ ఒమన్ పోలీసులు సన్మానించారు. ఆ హీరో పేరు జస్సెమ్ అల్ బథారి. అల్ షువైమియా ప్రాంతంలోని సముద్ర తీరంలో తొమ్మిది మంది పడవ ప్రమాదంలో ఇరుక్కోగా వారిని ఆయన రక్షించాడు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించగానే, తాను అటువైపుగా వెళ్ళాననీ, ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అందులోనివారు సముద్రంలో దూకారనీ, అందులో కొందరికి ఈత రాదనీ, అతి కష్టమ్మీద అందర్నీ రక్షించి తన బోటులోకి చేర్చానని జస్సెమ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్అ ంబులెన్స్కి అలాగే రాయల్ ఒమన్ పోలీసులకి, తన స్నేహితుడొకరికి ఘటనపై సమాచారం ఇచ్చినట్లు జస్సెమ్ వివరించారు. అక్టోబర్ 1న ఈ ఘటన జరిగింది. దోఫార్ పోలీస్ కమాండ్ అసిస్టెంట్ కమాండర్ కల్నల్ అలీ బసాదిక్ సమక్షంలో జస్సెమ్ అల్ బథారికి సన్మానం జరిగింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల