క్రిస్మస్ సంబరాలు సంబరాలకు దూరంగా ఫిలిప్పీన్స్...!!
- December 25, 2017
క్రిస్మస్ ముందు రోజు ఫిలిప్పీన్స్ ను విషాదం ముంచెత్తింది. టెంబ్లిన్ తుపాను కారణంగా దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. జనావాసాలపై హఠాత్తుగా వరదనీళ్లు రావడంతో 200 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. దీంతో ఫిలిప్పీన్స్‌లోని రెండో అతిపెద్ద ద్వీపం మిండానావోలో పరిస్థితి దయనీయంగా ఉంది.
ఫిలిప్పీన్స్‌లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ, టెలీఫోన్ లైన్లు తెగిపోయాయి. దీంతో సహాయచర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసులతోపాటూ సైనికులు, పోలీసులు, వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వారం క్రితం వచ్చిన కేయ్టెక్ తుపానుకు 50 మంది చనిపోగా.. క్రిస్మస్ సంబరాలకు ముందు టెంబ్లీన్ 200 మందిని బలి తీసుకోవడం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది.
ముందస్తు హెచ్చరికలు వచ్చినా కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లకపోవడంతో ప్రాణనష్టం ఎక్కువైంది. ఏడాదికి 20 తుపానులను చూసే ఫిలిప్పీన్స్ మిండానోవా ప్రజలు ట్రెంబ్లీన్ తుపానును కూడా సీరియస్‌గా తీసుకోలేదు. హఠాత్తుగా వరదనీళ్లు ఇళ్లను ముంచెత్తడంతో స్థానికులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విపత్తులో 159 మంది గల్లంతవగా.. 70 వేల మంది తమ ఇళ్లు ఖాళీ చేశారు.
ట్రెంబ్లిన్ తుపాను దక్షిణ వియత్నాం వైపు ప్రయాణిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఫిలిప్పీన్స్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్‌లో కూడా పోప్ ఫ్రాన్సిస్ మిండనోవా బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం







